Dokka: ఉండవల్లి శ్రీదేవికి ఇది నా వ్యక్తిగత సలహా: డొక్కా మాణిక్యవరప్రసాద్

Dokka Manikya Varaprasad personal advise to Undavalli Sridevi

  • నిన్న తాడికొండ నియోజకవర్గం రావెలలో నారా లోకేశ్ కార్యక్రమం
  • అమరావతి రైతులతో సమావేశమైన టీడీపీ యువనేత
  • వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఉండవల్లి శ్రీదేవి 
  • ఉండవల్లి శ్రీదేవి గతంలో ఏం మాట్లాడారు, నిన్న ఏం మాట్లాడారన్న డొక్కా
  • ఏం మాట్లాడినా... రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుందని హితవు

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిన్న తాడికొండ నియోజకవర్గంలో నారా లోకేశ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలను వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఖండించారు. ఉండవల్లి శ్రీదేవి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. 

"ఉండవల్లి శ్రీదేవి గతంలో ఏం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మీ రాజకీయాలు... మీ ఇష్టం. మీకు ఏ రాజకీయ విధానం నచ్చితే ఆ రాజకీయ విధానం వెంట వెళ్లొచ్చు. అయితే, కనీసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి కదా. రాజీనామా చేయకుండా వెళ్లి మీరేదో ప్రభుత్వం మీద, జగన్ మీద ఆరోపణలు చేస్తే ఎలా? ఈ విషయం గురించి శ్రీదేవి గారు ఒకసారి ఆలోచించాలి. 

ఆమె రాజకీయ విధానం గురించి నేనేమీ ప్రశ్నించడంలేదు. అది ఆమె ఇష్టం. కానీ ఆరోపణలు చేసేటప్పుడు ఆమె కొంచమైనా ఆలోచిస్తోందా? ఉండవల్లి శ్రీదేవికి నా వ్యక్తిగత సలహా ఏంటంటే... ఏదో ఊరికే ఆరోపణలు చేయొద్దు... ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత మాట్లాడండి" అంటూ సలహా ఇచ్చారు.

Dokka
Undvalli Sridevi
Nara Lokesh
YSRCP
TDP
  • Loading...

More Telugu News