Andhra Pradesh: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు

AP and Telangana governors convey independence day greetings
  • చెన్నైలోని  తన ఇంట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తమిళిసై
  • అందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపు  
  • 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 
దేశ, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను స్మరించుకుందామన్నారు. మెరుగైన దేశ నిర్మాణం కోసం నిబద్ధతను పునరుద్ఘాటిస్తామన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చెన్నైలోని తన ఇంట్లో జాతీయ జెండాను ఆవిష్కరించినట్లు తమిళిసై ట్వీట్టర్ (ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. అందరూ కూడా తమ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆమె కోరారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర, దేశ ప్రజలకు 77వ స్వతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  
Andhra Pradesh
Telangana
independence day

More Telugu News