ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ విషయంలో గొడవ, భార్యను చంపేసిన భర్త
- ఇన్‌స్టాలో భార్యకు అత్యధిక ఫాలోవర్లు.. భర్తను బ్లాక్ చేసిన భార్య
- ఈ విషయమై పలుమార్లు ఇరువురి మధ్య గొడవ
- ఆదివారం బయటకు వెళ్లిన సమయంలో వాగ్వాదం.. గొంతు కోసి చంపేసిన భర్త
తన భార్యకు ఎవరితోనే ఎఫైర్ ఉందనే అనుమానం భర్తకు వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం వారు తమ ఎస్‌యూవీ కారులో రాయ్‌బరేలికి బయలుదేరారు. అయితే మధ్యలోనే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే వైపు కారును తిప్పాడు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం జరగగా.. గొంతు కోసి చంపేశాడు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి చూడగా హత్య విషయం వెలుగు చూసింది. తమ ముందే తల్లిని చంపారని ఆ పిల్లలు పోలీసులకు చెప్పారు. దీంతో భర్తను అరెస్ట్ చేశారు.