కొడుకుతో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ ఫొటో ట్వీట్ చేసిన మస్క్

Elon Musk Shares Adorable Pic With His Son
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో
  • గంటల వ్యవధిలోనే 23 మిలియన్ల వ్యూస్.. 4 లక్షలకు పైగా లైకులు
  • తండ్రీకొడుకుల ఫొటోకు కామెంట్లతో అభినందనలు తెలిపిన నెటిజన్లు
టెస్లా చీఫ్.. స్పేస్ ఎక్స్ కంపెనీ ఓనర్ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే! టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్ లో ఆకాశం అంచుల దాకా వెళ్లి రావడం దాకా.. ట్విట్టర్ కొనుగోలు చేయడంతో పాటు అందులోని కీలక సిబ్బందిని గేటు నుంచే ఇంటికి సాగనంపడం.. ఇలా మస్క్ ఏం చేసినా సంచలనమే. ఇటీవల ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ తో కేజ్ ఫైట్ కు రెడీ అంటూ ఛాలెంజ్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ వ్యాపార దిగ్గజాల మధ్య త్వరలోనే కేజ్ ఫైట్ జరగనుందని సమాచారం.

తాజాగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. గంటల వ్యవధిలోనే ఏకంగా 23 మిలియన్ల మంది ఫొటోను చూడడంతో పాటు నాలుగున్నర లక్షల మంది లైక్ కొట్టారు. ఫొటోకు అద్భుతమంటూ మరో 19 వేల మంది నెటిజన్లు కామెంట్ చేశారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటారా.. తన చిన్నారి కొడుకుతో వర్కవుట్లు చేస్తూ మస్క్ ఫొటో దిగి ట్విట్టర్ లో పెట్టాడు. కొడుకుతో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ జోడించాడు. ఈ ఫొటోకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా, ఎలాన్ మస్క్ కు మొత్తం ఆరుగురు సంతానం.
Go Back to Shorts
Elon Musk
Pic With Son
Tesla chief
spaceex
Twitter
musk
offbeat

More Telugu News