అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
- మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ మ్యూజిక్ షోలో కాల్పుల కలకలం
- ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడి పారిపోయినట్టు గుర్తించిన పోలీసులు
- ఘటనలో ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
- నిందితుల కోసం గాలింపు
మ్యూజిక్ షోలో పాల్గొన్న వారిని నిందితులు కావాలనే టార్గెట్ చేసుకుని ఉంటారని పోలీస్ చీఫ్ బ్రయన్ ఓ హారా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఎవరనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు. ‘‘అప్పటివరకూ అంతా బానే ఉంది. కానీ ఆ మరుక్షణమే కాల్పులు జరిగాయి. తూటాల నుంచి తప్పించుకునేందుకు అందరూ నేలపై పడుకున్నారు’’ అని ఆ మ్యూజిక్ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకుడు ఒకరు తెలిపారు. కాగా, నిందితుల కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.