ఆధునికీకరించిన మిగ్-29 ఫైటర్ జెట్లను శ్రీనగర్ లో మోహరించిన ఎయిర్ ఫోర్స్.. కారణం ఇదే!
- మిగ్-21ల స్థానంలో మిగ్-29ల మోహరింపు
- మిగ్-21లతో పోలిస్తే మిగ్-29లు మరెంతో శక్తిమంతం
- మిగ్-29లో ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ మిస్సైల్ సిస్టమ్
మిగ్-21ల కంటే మిగ్-29లలో ఎన్నో అడ్వాంటేజ్ లు ఉన్నాయి. పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్ లో ఈ విమానాలు ఎయిర్ స్ట్రైక్స్ జరిపాయి. వీటిలో ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ మిస్సైల్స్ సిస్టమ్ ఉంది. మిగ్-21లో లేని ఎయిర్ టు గ్రౌండ్ వెపనరీ సిస్టమ్. యుద్ధ సమయంలో శత్రు విమానాల సామర్థ్యాలను జామ్ చేసే వ్యవస్థ కూడా మిగ్-29లో ఉంది. ఇప్పటికే ఈ యుద్ధ విమానాలు కశ్మీర్ లోయ మొత్తం చక్కర్లు కొట్టాయి. చైనా వైపు నుంచి గగనతల ఉల్లంఘనలు ఏమైనా చోటుచేసుకుంటే వారి యుద్ధ విమానాలను మిగ్-29లు దీటుగా ఎదుర్కోగలవు.