అరవింద్ నోటికి అదుపులేకుండా పోతోంది... ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడే పోటీ చేస్తా: కవిత
- పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని అరవింద్‌కు సూచన
- తన కట్టె కాలే వరకు నిజామాబాద్‌లోనే ఉంటానన్న కవిత
- బండి సంజయ్ తెలంగాణ హక్కుల కోసం ఎప్పుడూ మాట్లాడలేదని విమర్శ
కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ కరెంట్ తీగలు పట్టుకుంటే కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుందన్నారు. తెలంగాణ హక్కుల కోసం బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంటులో ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ గెలుపు శూన్యమన్నారు. అన్ని స్థానాలను తామే గెలుస్తామన్నారు. నిజామాబాద్‌కు ఐటీ పరిశ్రమను తీసుకుని వచ్చామని, స్వాతంత్య్రం వచ్చాక ఇన్ని నిధులు మంజూరు చేసిన ఘనత తమ పార్టీదే అన్నారు.