Advertisement

ఆ దర్శకుడు బెడ్ పైకి లాగే ప్రయత్నం చేశాడు: వర్షిణి

One director forced me remove cloths says Varshini
  • లాక్ డౌన్ కు ముందు వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందన్న వర్షిణి
  • హోటల్ లో తనను దర్శకుడు వేధించాడని ఆవేదన
  • అతన్ని విడిపించుకుని బయటకు వచ్చేశానని వెల్లడి
 ఢీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న వర్షిణి ఇప్పుడు యాంకర్ గా బాగా పాప్యులర్ అవుతోంది.  సోషల్ మీడియాలో కూడా హాట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. సినీ రంగంలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే గతంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె షేర్ చేసుకుంది.

లాక్ డౌన్ కు ముందు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం తనకు వచ్చిందని వర్షిణి తెలిపింది. ఆడిషన్స్ కోసం హోటల్ కు రావాలని ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ పిలిస్తే వెళ్లానని... ఆడిషన్ అయిపోయిన తర్వాత అంతా సూపర్, వెబ్ సిరీస్ కు నువ్వు బాగా సూట్ అవుతావని ఆ డైరెక్టర్ అన్నాడని తెలిపింది. ఇక తనకు అవకాశం వచ్చినట్టేనని తాను అనుకున్నానని... అయితే తనతో పాటు గదిలోకి రావాలని ఆయన పిలిచాడని, బెడ్ పైకి లాగే ప్రయత్నం చేశాడని, డ్రెస్ విప్పమని బలవంతం చేశాడని చెప్పింది. అప్పుడు తానెంతో భయపడిపోయానని, అతన్ని విడిపించుకుని బయటకు వచ్చేశానని, ఆ తర్వాత చాలా సేపు ఏడ్చానని తెలిపింది. తన జీవితంలో అదొక భయానక అనుభవమని చెప్పింది.
Advertisement
Varshini
ANCHOR
Sexual Assault

More Telugu News