గృహలక్ష్మి పథకం గురించి మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక ప్రకటన
- ఈ పథకం నిరంతర ప్రక్రియ అని వెల్లడించిన మంత్రి
- పుకార్లను, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి
- మొదటి విడత దరఖాస్తులకు రేపే ఆఖరు తేదీ
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. వాటిని నమ్మొద్దని మంత్రి సూచించారు. ఖాళీ స్థలం ఉన్న ఎవరైనా సరే గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చని పేర్కొన్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ల కేటాయింపులు ఉంటాయనీ, మిగతావారు రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు