Arvind Kejriwal: ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ కు కేజ్రీవాల్ లేఖ

Arvind Kejriwal letter to Rahul Gandhi
  • ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించినందుకు ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్
  • 2 కోట్ల ఢిల్లీ ప్రజల తరపున ధన్యవాదాలు చెపుతున్నానని వ్యాఖ్య
  • రాజ్యాంగంపై మీ విధేయత దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని ప్రశంస
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఆప్ కు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా లెటర్ రాశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఢిల్లీలోని 2 కోట్ల ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

పార్లమెంటుకు బయట, లోపల ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడేందుకు మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పదని... మన రాజ్యాంగ సూత్రాల పట్ల మీకున్న అచంచలమైన విధేయత దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని అన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
Arvind Kejriwal
AAP
Rahul Gandhi
Congress

More Telugu News