'ఇండియా' కూటమి నిన్నటి సెమీఫైనల్స్ లోనే ఓడిపోయింది: ప్రధాని మోదీ ఎద్దేవా

Modi satires on INDIA alliance
విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A)పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి, అవకాశవాద రాజకీయాలు, కుటుంబ పాలన నుంచి దేశానికి విముక్తి లభించాలని పేర్కొన్నారు. నిన్న రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమికి సెమీఫైనల్స్ ఎదురయ్యాయని వెల్లడించారు. కానీ ఇండియా కూటమి సెమీఫైనల్స్ లోనే ఓడిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత విపక్షాలకు లేదని స్పష్టం చేశారు ఇండియా కూటమి వల్లే సామాజిక న్యాయానికి నష్టం వాటిల్లుతోందని అన్నారు.
Go Back to Shorts
Narendra Modi
INDIA
BJP
NDA
Opposition Alliance
Semifinals
Rajya Sabha
Parliament
India

More Telugu News