ఢిల్లీ మంత్రి అతిషికి ఏకంగా 14 శాఖలను కట్టబెట్టిన సీఎం కేజ్రీవాల్
- తన క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించిన అరవింద్ కేజ్రీవాల్
- ఢిల్లీ సేవల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందిన
తర్వాతి రోజే అనూహ్య నిర్ణయం - దేశ రాజధాని బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించనున్న ఢిల్లీ సేవల బిల్లు
ఢిల్లీ క్యాబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి అయిన అతిషి వద్ద ఇప్పుడు ఏకంగా 14 పోర్ట్‌ఫోలియోలు ఉన్నాయి. ఇందులో కీలకమైన విద్య, విద్యుత్ శాఖలు ఉన్నాయి. అతిషి కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనీలాండరింగ్ కేసుల్లో జైలులో ఉన్న మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామాలు చేయడంతో సౌరభ్ భరద్వాజ్, అతిషి ఈ ఏడాది మార్చిలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.