‘బండి’కి తుప్పు పట్టిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

bandi sanjay strong counter to minister ktr
  • బీఆర్ఎస్ కారుకే తుప్పు పట్టిందన్న బండి సంజయ్
  • కేటీఆర్‌‌కు అంత అహంకారం పనికి రాదని మండిపాటు
  • దమ్ముంటే గోషామహల్‌ నుంచి పోటీ చేయాలని కేటీఆర్‌‌కు సవాల్
‘బండి’కి తుప్పు పట్టిందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ తుప్పు పట్టింది బండికి కాదు.. నీ కారుకే తుప్పు పట్టింది” అని మండిపడ్డారు. కేటీఆర్‌‌కు అంత అహంకారం పనికి రాదని విమర్శించారు. 

‘‘డ్రగ్స్‌ తీసుకుని మాట్లాడుతున్నావా? నీ భాషను  చూసి నీ ఎమ్మెల్యేలే ఛీకొడుతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌లో ఒక్కరు కూడా ఉండరు” అని హెచ్చరించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విషయంలో కేటీఆర్‌‌ చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ మండిపడ్డారు. రాజాసింగ్ దమ్మున్న లీడర్ అని, దమ్ముంటే గోషామహల్‌ నుంచి పోటీ చేయాలని కేటీఆర్‌‌కు సవాల్ విసిరారు.
Advertisement
Bandi Sanjay
KTR
Raja Singh
BRS
BJP

More Telugu News