రైల్వే పట్టాలపై పనిచేస్తుండగా దూసుకొచ్చిన రైలు.. కిందనున్న నదిలోకి దూకేసిన కార్మికుడు
- బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఘటన
- తాడు సాయంతో కార్మికుడిని కాపాడిన స్థానికులు
- ఆసుపత్రికి తరలించిన రైల్వే పోలీసులు
అతడు నదిలో దూకడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్ద తాడును నదిలోకి విసిరి అశోక్‌ను కాపాడారు. మరోవైపు, సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు. అశోక్ ఓ ప్రైవేటు రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.