మాజీ ప్రియుడికి పదేపదే ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతి.. చురకంటించిన జొమాటో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ ప్రియుడికి పదేపదే ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతి.. చురకంటించిన జొమాటో!

Zomato requests a customer to stop ordering for her ex
  • భోపాల్‌కు చెందిన అంకిత తన ప్రియుడికి జొమాటోలో ఫుడ్ ఆర్డర్
  • క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా మూడుసార్లు ఆర్డర్ చేసిన యువతి
  • ఫుడ్‌ను క్యాన్సిల్ చేసిన మాజీ
  • దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఆర్డర్ చేయవద్దని జొమాటో ట్విస్ట్
ఓ ప్రియురాలు పదేపదే తన ప్రియుడికి ఫుడ్ ఆర్డర్ చేస్తుండటంతో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ఆసక్తికరంగా స్పందించింది. నీ ఫ్రెండ్‌కు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయవద్దని సూచించింది. ఈ మేరకు జొమాటో తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్ ద్వారా సదరు కస్టమర్‌ను అభ్యర్థించింది. భోపాల్‌కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ ప్రియుడికి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆమె పెట్టిన ఫుడ్ ఆర్డర్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకుంది. అయితే తీరా ఆ ఫుడ్ అక్కడకి వెళ్లాక సదరు మాజీ క్యాన్సిల్ చేశాడు. ఇలా మూడుసార్లు జరిగింది. దీంతో జొమాటో జోక్యం చేసుకుంది.

'భోపాల్‌కు చెందిన అంకిత దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ పంపించడం ఆపివేయండి. అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడం ఇది మూడోసారి' అని ట్వీట్ చేసింది. దయచేసి ఎవరైనా అంకిత ఖాతాలో క్యాష్ ఆన్ డెలివరీని బ్లాక్ చేసినట్లు చెప్పగలరని పేర్కొంది. ఆమె ఈ విషయం తెలియక ప్రయత్నిస్తోందని తెలిపింది. కాగా, ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. దీనికి లక్షలాది వ్యూస్ రాగా, వేలాది లైక్స్ వచ్చాయి.

అయితే, అంకిత తన మాజీ కోసం అలాంటి ఆర్డర్ పెట్టినది నిజమా? కాదా? లేక, ఇది జొమాటో ప్రత్యేక మార్కెటింగ్ టెక్నికా? అని కొంతమంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు.
Advertisement
zomato
bhopal

More Telugu News