అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణం ఆపేయండి: ఏపీ హైకోర్టు ఆదేశాలు
- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు బెంచ్
- రాజధాని రైతుల పిటిషన్ల విచారణలో భాగంగా ఆదేశాలు
- జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్ల పట్టాలను అందించిన ప్రభుత్వం
జగనన్న కాలనీల పేరుతో రాజధానేతర ప్రాంత వాసులకు ప్రభుత్వం ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాలను అందజేసింది. ఇందుకోసం రాజధాని ప్రాంతంలో 1400 ఎకరాలను కేటాయించి, 50,793 మందికి ఇళ్ల నిర్మాణ పత్రాలను మంజూరు చేసింది. అయితే, అమరావతిలోని ఆర్-5 జోన్ ఎలక్ట్రానిక్ సిటీ అని, పేదలకు ఇళ్ల స్థలాలను మరోచోట ఇవ్వాలని రాజధాని రైతులు కోర్టుకెక్కారు. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, సీఆర్డీఏ ఒప్పందానికి విరుద్దమని కోర్టుకు తెలిపారు.