వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడికి చిత్రహింసలు
- మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఘటన
- బాధితుడికి స్థానిక మహిళతో వివాహేతర సంబంధం
- ఫలితంగా మహిళ అత్తింటిని వీడి పుట్టింటికి చేరుకున్న వైనం
- దీనికి అతడే కారణమంటూ ఒంటిపై వాతలు పెట్టిన స్నేహితులు
బాధితుడు వారి నుంచి అతికష్టం మీద తప్పించుకుని హైవేపై ఉన్న ఓ దాబా వద్దకు చేరుకున్నాడు. ఈ విషయం కిట్టు కుటుంబసభ్యులకు తెలిసి వారు అక్కడికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఓ మహిళతో కిట్టూకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఆమె తన అత్తింటిని వీడి పుట్టింటికి చేరుకోవాల్సి వచ్చిందన్న కక్షతోనే నిందితులు ఈ దారుణానికి తెగబడ్డట్టు పోలీసులు తెలిపారు.