పిఠాపురంలో ఒకే ఇంటి నంబరులో వందలాది ఓట్లు.. నిజమేనన్న అధికారులు
- 1-2-63 ఇంటి నంబరుపై 448 ఓట్లు
- రంగంలోకి అధికారులు
- ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్న ఫాం-8 స్వీకరణ
- త్వరలోనే కచ్చితమైన ఓటర్ల జాబితా ప్రచురణ
ఒకే ఇంటి నంబరుపై వందలాది ఓట్లు ఉండడం నిజమేనని ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి ఫాం-8 తీసుకుంటున్నట్టు చెప్పారు. 448 ఓట్లలో ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది లేరనే వివరాలను నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తప్పొప్పులు సవరించి కచ్చితమైన ఓటర్ల జాబితాను త్వరలోనే ప్రచురిస్తామని తెలిపారు.