సమ్మెకు సిద్ధమైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు.. 24 ఏళ్ల తర్వాత తొలిసారి
- వేతన సవరణ సహా 12 డిమాండ్లు
- గురువారం నుంచే ఆందోళన చేస్తున్న ఉద్యోగులు
- సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానం
- సమస్యలు పరిష్కారం కాకుంటే ఆగస్టు 10 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయం
ఉద్యోగుల నిరసనలపై స్పందించిన ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చర్చిద్దామని, గుణదల విద్యుత్ సౌధలోని ఏపీపీసీసీ చైర్మన్ చాంబర్‌కు పదిమంది నేతలు రావాలని కబురుపెట్టింది. అయితే, ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి వచ్చేంత వరకు నిరసన ప్రదర్శనలు కొనసాగించాలని, ప్రభుత్వం మొండికేస్తే ఆగస్టు 10 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగులు నిర్ణయించారు. కాగా, 1999లో వేతన సవరణ సహా ఇతర డిమాండ్ల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మళ్లీ ఇన్నేళ్లకు సమ్మెకు సిద్ధమవుతున్నారు.