హైదరాబాద్లో భారీ వర్షం, వరదల్లో చలాన్ వేసినట్టు ఫొటో వైరల్ ... క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్
- నిన్నటి వరకు భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం
- అలాంటి సమయంలోను పోలీసులు చలాన్ కోసం ఫోటోలు తీశారంటూ ఆరోపణలు
- అలాంటిదేమీ లేదని స్పష్టతనిచ్చిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్
దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఫోటోపై స్పందిస్తూ... అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చలాన్ వేయలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆ ఫోటో ఎక్కడ.. ఎందుకు తీశారో కూడా వెల్లడించారు. అయోధ్య క్రాస్ రోడ్డులో వాటర్ లాగింగ్ అయితే తొలగింపు చర్యల కోసం మాత్రమే పోలీసులు వీడియో తీసినట్లు తెలిపారు.