భద్రాచలంలో మునిగిన స్నానఘట్ట ప్రాంతం.. గోదావరి నీటిమట్టం 58 అడుగులకు చేరే అవకాశం!
- శుక్రవారం రాత్రి 52.1 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
- ఇప్పటికే కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్
గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో భద్రాచలంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలంలో స్నానఘట్టాల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడంతోపాటు బందోబస్తు ఏర్పాటు చేశారు. నీటి మట్టం 56 అడుగుల నుండి 58 అడుగులకు చేరుకునే అవకాశముందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.