ఏపీ హైకోర్టులో టీడీపీ నేత అనితకు ఊరట
- ఇటీవల సజ్జనరావు అనే వ్యక్తి ఇంటి ముందు అనిత ఆందోళన
- నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు
- అనితపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
ఈ కేసులపై అనిత హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో అనిత తరపున న్యాయవాది సతీశ్ వాదనలు వినిపించారు. వాదనలను విన్న తర్వాత హైకోర్టు పోలీసులకు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అనితపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.