విద్యార్థుల ముందే నగ్నంగా నిద్రించిన హెడ్‌మాస్టర్‌పై వేటు

Drunk UP Headmaster Seen Sleeping Naked In Front Of Students Suspended
  • ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
  • మద్యం మత్తులో హెడ్‌మాస్టర్ అసభ్యకర చర్యలు
  • హెడ్‌మాస్టర్ తీరుతో స్కూలుకు వెళ్లడం మానేసిన బాలికలు
  • ఘటన విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో నిందితుడిపై సస్పెన్షన్
మద్యం మత్తులో విద్యార్థుల ముందు అసభ్యంగా ప్రవర్తించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. హెడ్‌మాస్టర్‌ చేష్టలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బాహ్‌రైఖ్ జిల్లా విశేశ్వర్‌గంజ్ బ్లాక్‌లోని శివపూర్ బైరాగీ పాఠశాలలో ఓ హెడ్‌మాస్టర్ పూటుగా తాగి నగ్నంగా నిద్రిస్తున్న వైనం వీడియోలో కనిపించింది. మరోవైపు, హెడ్‌మాస్టర్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు మండిపడుతున్నారు. నిందితుడు దుర్గా జైశ్వాల్ తరచూ పాఠశాలలో అసభ్యకరమైన చర్యలకు పాల్పడేవాడని ఆరోపించారు. పిల్లల ముందు షర్టు తొలగించేవాడని, అతడి తీరుతో బాలికలు స్కూలుకు వెళ్లడం మానేశారని చెప్పారు. 

తల్లిదండ్రుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన విద్యాశాఖ దర్యాప్తు నిర్వహించి జైశ్వాల్‌ను సస్పెండ్ చేసింది. ‘‘డిపార్టెమెంట్ ఎంక్వైరీ ప్రారంభమైంది. అవసరమైతే హెడ్‌మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తాం’’ అని బేసిక్ శిక్షా అధికారి(బీఎస్ఏ) మీడియాకు తెలిపారు.
Go Back to Shorts
Uttar Pradesh
Crime News

More Telugu News