మణిపూర్ మహిళపై బీఎస్ఎఫ్ జవాను లైంగిక వేధింపులు.. సీసీ కెమెరాలో రికార్డయిన దారుణం
- మణిపూర్ లో వరుసగా వెలుగు చూస్తున్న దారుణాలు
- స్టోర్ లో ఉన్న మహిళలపై బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
- విధుల నుంచి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
ఇంఫాల్ లో ఈ నెల 20న ఈ ఘటన చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ సతీశ్ ప్రసాద్ గా గుర్తించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో ఆయన యూనిఫామ్ లోనే ఉన్నాడు. అంతేకాదు, ఆయన వద్ద ఇన్సాస్ రైఫిల్ కూడా ఉంది. ఈ ఘటన నేపథ్యంలో సతీశ్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. సతీశ్ పై డిపార్ట్ మెంటల్ ప్రొసీడింగ్స్ కూడా జరుగుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.