జగన్ పాలనలో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సంతోషంగా ఉన్నారు: వంగలపూడి అనిత
- జగన్ మహిళా ద్రోహి అన్న అనిత
- పోలీస్ స్టేషన్లకు వెళ్లినా న్యాయం జరగడం లేదని విమర్శ
- మణిపూర్ లోని మహిళల కంటే మన మహిళల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన
ఏపీలోని మహిళలు మణిపూర్ లోని మహిళల కంటే దారుణమైన స్థితిలో ఉన్నారని అనిత అన్నారు. ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్న బాధల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే... పవన్ భార్యల గురించి జగన్ మాట్లాడతారని దుయ్యబట్టారు. పిల్లలను తల్లులు పెంచే తీరు సరిగా లేదని ఒక మంత్రి... ఒకటి, రెండు అత్యాచారాలకే ఇంత రాధ్దాంతమా అని మహిళా మంత్రులు మాట్లాడుతుండటం దారుణమని అన్నారు.పోలీస్ స్టేషన్లకు వెళ్లినా న్యాయం జరగడం లేదని విమర్శించారు.