మూడేళ్ల చిన్నారి చేతిలో పేలిన తుపాకి.. ఏడాది వయసున్న చెల్లి మృతి.. అమెరికాలో ఘోరం!
- కాలిఫోర్నియాలో సోమవారం చోటుచేసుకున్న ఘటన
- తలకు బుల్లెట్ గాయంతో పడిపోయిన పాప
- ఆసుపత్రికి తరలించిన ఎమర్జెన్సీ సిబ్బంది
కాలిఫోర్నియాలోని శాన్ డియాగో కౌంటీ ఫాల్ బ్రూక్ లో సోమవారం ఉదయం 7:30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘోరం జరిగింది. మూడేళ్ల చిన్నారి తన ఏడాది వయసున్న చెల్లితో కలిసి ఆడుకుంటూ తుపాకీ ట్రిగ్గర్ నొక్కింది. దీంతో ఎదురుగా కూర్చున్న పాప తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. పాప ప్రాణాలు కాపడేందుకు శాయశక్తులా ప్రయత్నించామని, అయితే, ఆసుపత్రికి తరలించేలోగా చనిపోయిందని వివరించారు. అయితే, ఇంట్లో పెద్దవాళ్లు ఏమయ్యారు.. చిన్నారి చేతికి గన్ ఎలా వచ్చిందనే దానిపై దర్యాఫ్తు జరుపుతున్నామని శాన్ డియాగో కౌంటీ పోలీసులు తెలిపారు.