Ranga Reddy District: షాద్‌నగర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మందికి తీవ్ర గాయాలు
నగర శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బూర్గుల శివారులోగల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుల్లో కొందరిని షాద్ నగర్‌లోని కమ్యూనిటీ ఆసుపత్రికి, మిగిలిన వారిని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కంపెనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు.