36 ఏళ్లలో 35వసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన నొవాక్ జొకోవిచ్
- వింబుల్డన్‌లో ఫైనల్ చేరిన జొకోవిచ్
- రేపు ప్రపంచ నం.1 అల్కరాజ్‌తో అమీతుమీ
- మరో సెమీస్‌లో మెద్వెదెవ్‌పై గెలిచిన అల్కరాజ్
ఆదివారం జరిగే బ్లాక్ బస్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ గార్ఫియాతో నొవాక్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. రెండో సెమీస్‌లో 20 ఏళ్ల అల్కరాజ్ (స్పెయిన్) 6-3, 6-3, 6-3తో వరుస సెట్లలో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొంది తొలిసారి వింబుల్డన్ ఫైనల్ కు అర్హత సాధించాడు. ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ గెలిస్తే వింబుల్డన్‌ను ఎనిమిది సార్లు నెగ్గిన ఆటగాడిగా స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రికార్డును సమం చేస్తాడు.