విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన పనులు.. పలు రైళ్ల రద్దు
- నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు
- మరికొన్ని రైళ్లు నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా మళ్లింపు
- ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే
వీటితోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. ధన్‌బాద్-అళప్పుల (13351) బొకారో ఎక్స్‌ప్రెస్‌ను 11, 14, 15వ తేదీల్లో, హటియా-ఎస్ఎంబీ బెంగళూరు (12835) రైలును 11న, 14న టాటానగర్-ఎస్‌ఎంవీ బెంగళూరు (12889), 15న హటియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (18637) రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్టు వివరించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని త్రిపాఠి కోరారు.