సికింద్రాబాద్ లో మళ్లీ అగ్ని ప్రమాదం
- రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు
- మంటలను ఆర్పుతున్న మూడు ఫైర్ ఇంజన్లు
- షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్న స్థానికులు
దాని చుట్టుపక్కల మరిన్ని దుకాణాలతో పాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. షాట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, సికింద్రాబాద్ పరిధిలో గత కొంతకాలంగా రెండు షాపింగ్ కాంప్లెక్స్ లు, ఓ లాడ్జిలో అగ్ని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.