విద్యుదాఘాతంతో ఫలక్‌నుమా రైలు ప్రమాదం?.. క్లూస్ టీమ్ అనుమానం!
- ఎస్4 బోగిలోని టాయిలెట్‌లో విద్యుదాఘాతం జరిగినట్లుగా భావిస్తున్న క్లూస్ టీమ్
- నిమిషాల్లోనే మంటలు మిగతా బోగీలకు వ్యాప్తి
- వందకు పైగా నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు
బెంగాల్ లోని హౌరా నుండి సికింద్రాబాద్ వస్తోన్న ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి శివారులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. కానీ ఐదు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రైల్వే శాఖకు రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది.