సినిమాలపై మక్కువతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన సీఐ స్వర్ణలత.. వీడియో వైరల్

CI Swarnalatha dance video viral
  • నోట్ల మార్పిడి వ్యవహారంలో డబ్బులు గుంజిన కేసులో స్వర్ణలత అరెస్ట్
  • సినిమాల్లో ఒక మంచి పాత్రను ఇస్తానన్న ప్రజాప్రతినిధి
  • డ్యాన్స్ మాస్టర్ ను పెట్టుకుని ప్రాక్టీస్ చేసిన స్వర్ణలత
కరెన్సీ నోట్ల మార్పిడికి సంబంధించిన వ్యవహారంలో డబ్బులు గుంజిన కేసులో సీఐ స్వర్ణలత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమెపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలతో ఆమె పలు దందాలు చేశారని చెపుతున్నారు. మరోవైపు ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. 

ఆమెకు సినిమాల్లో కనిపించాలనే మక్కువ ఎక్కువగా ఉందట. తాను త్వరలో తీయబోయే సినిమాలో మంచి పాత్రను ఇస్తానని... అయితే డ్యాన్స్ లో ప్రావీణ్యం ఉండాలని ఒక ప్రజాప్రతినిధి చెప్పడంతో... ఆమె ఒక డ్యాన్స్ మాస్టర్ ను నియమించుకుని ప్రాక్టీస్ చేశారట. డ్యాన్స్ కు సంబంధించి పలు వీడియోలు కూడా తీశారు. వాటిని యూట్యూబ్ లో పెట్టారు. ప్రస్తుతం ఆమె అరెస్ట్ కావడంతో ఆమె డ్యాన్స్ వీడియోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.


Go Back to Shorts
Swarnalatha
CI
Dance

More Telugu News