అమెరికాలో అమానవీయం.. కుమారుడిని ఏళ్ల తరబడి భర్తలా వాడుకున్న తల్లి!
- 8 ఏళ్ల క్రితం 17 ఏళ్ల వయసులో రూడీ అదృశ్యం
- అతడిని తన సెక్స్ బానిసగా వాడుకుందని ఆరోపణలు
- నిజం లేదంటున్న పోలీసులు
కుమారుడిని బంధించిన తల్లి.. తండ్రి పాత్ర పోషించాలని.. అంటే తనకు భర్తలా వ్యవహరించాలని కోరిందని క్వానెల్ తెలిపారు. ఈ విషయం బయటపెడితే చిక్కుల్లో పడతావని అతడిని హెచ్చరించింది. హోస్టన్ పోలీస్ విభాగం అధికారులు రూడీ ఫరియస్, అతడి తల్లి జేనీ శాంటనలను కార్యకర్త సమక్షంలో ఓ హోటల్లో ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
17 ఏళ్లు ఉన్నప్పుడు 2015లో ఫరియస్ రెండు పెంపుడు శునకాలతో వాకింగ్‌కు వెళ్లి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కుక్కలు కనిపించినా అతడి జాడమాత్రం లేకుండా పోయింది. కుమారుడిని బంధించిన తల్లి అతడిని సెక్స్ బానిసగా ఉపయోగించుకుందని క్వానెల్ తెలిపారు.
పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. కుమారుడిపై తల్లి వేధింపులకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, వీటి ఆధారంగా విచారించబోమని దర్యాప్తు అధికారులు జిల్లా అటార్నీకి తెలిపారు. అయితే, కార్యకర్త మాత్రం ఆరోపణలు నిజమేనని వాదిస్తున్నారు.