హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్.. నిన్న ఎంతమంది ప్రయాణించారంటే..!
- జులై 3న మెట్రో రైలులో 5 లక్షల 10 వేలమంది ప్రయాణం
- నాగోల్ నుండి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుండి కూకట్పల్లి రూట్లలో అధిక సంఖ్యలో ప్రయాణం
- ప్రారంభం నుండి 40 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చిన మెట్రో రైలు
2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో గత కొన్ని రోజులుగా ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆఫీసు వేళల్లో మెట్రోలో జనం రద్దీగా ఉంటున్నారు. అమీర్పేట జంక్షన్ ఉదయం, సాయంత్రం కిక్కిరిసిపోతోంది.