తేజస్వీయాదవ్పై సీబీఐ చార్జ్‌షీట్.. కేబినెట్ నుంచి డిస్మిస్ చేయాలని సుశీల్ మోదీ డిమాండ్
- 2004-2009 మధ్య ల్యాండ్స్ ఫర్ జాబ్ కుంభకోణం
- ఆ కాలంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలు ప్రసాద్ యాదవ్
- అవినీతిని సహించబోనన్న నితీశ్ వ్యాఖ్యలను గుర్తు చేసిన సుశీల్ మోదీ
2004-2009 మధ్య లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్స్ ఫర్ జాబ్ కుంభకోణం జరిగినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. పశ్చిమ మధ్య మండలంలో గ్రూప్-డి నియామకాల్లో అవినీతి జరిగినట్టు చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. రెండో చార్జ్‌షీట్‌లో మరో 14 మంది పేర్లను కూడా ప్రస్తావించింది.