ప్రభాస్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ఈ నెల 6న సలార్ టీజర్
- అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
- ఆదిపురుష్ తో నిరాశ పరిచిన ప్రభాస్
ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పాటు అనేక విమర్శలు ఎదుర్కోవడంతో నిరాశలో ఉన్న ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపేందుకు సలార్ చిత్ర బృందం నుంచి ట్రీట్ రానుంది. ఈ నెల 6న సలార్ టీజర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఆరో తేదీన ఉదయం 5.12 గంటలకు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ యూబ్యూట్ చానెల్లో https://www.youtube.com/@HombaleFilms/videos టీజర్ రిలీజ్ కానుంది ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.