హేమాహేమీలతో రామ్ చరణ్... కొత్త యాడ్ కోసమా?
- శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంతో బిజీగా ఉన్న రామ్ చరణ్
- ఇటీవలే రామ్ చరణ్ కు పుత్రికోత్సాహం
- మరోవైపు యాడ్ ఫిలింతో గ్లోబల్ స్టార్ కోలాహలం
తన భర్త కనిపించడంలేదని దీపిక పదుకొణె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రోమో మొదలవుతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ ఓ చేజింగ్ సీన్లో కనిపిస్తాడు. మరోవైపు రణవీర్ సింగ్ యాంగ్రీ లుక్ తో కనిపించగా, త్రిష కూడా దర్శనమిస్తుంది. మొత్తమ్మీద ఆ ప్రోమో ఓ భారీ యాక్షన్ చిత్రం స్థాయిలో ఉంది.