విస్తరిస్తున్న రుతుపవనాలు... కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
- గత 24 గంటల్లో దేశంలోని ఇతర భాగాలకు వ్యాపించిన రుతుపవనాలు
- రుతుపవనాల గమనానికి పరిస్థితులు అనుకూలమన్న ఐఎండీ
- జులై 2, 3 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు
ఈ నేపథ్యంలో, కోస్తాంధ్రకు వర్ష సూచన చేసింది. జులై 2, 3 తేదీల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో వాతావరణం చాలావరకు పొడిగానే ఉంటుందని పేర్కొంది. దక్షిణాదిన కేరళ, కర్ణాటక కోస్తా జిల్లాల్లో రాగల 5 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.