జ్వరంతోనే 'బ్రో' సినిమాకి డబ్బింగ్ చెప్పిన పవన్!
- పవన్ - సాయితేజ్ ప్రధాన పాత్రలుగా 'బ్రో'
- దర్శకత్వం వహించిన సముద్రఖని
- సంగీతాన్ని అందించిన తమన్
- వచ్చేనెల 28వ తేదీన సినిమా విడుదల
ఆ మధ్య తమిళంలో వచ్చిన 'వినోదయా సీతమ్' సినిమాకి ఇది రీమేక్. తమిళంలో ఆ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా అది. అక్కడ ఆ సినిమా చేసిన సముద్రఖని తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాకి 'బ్రో .. ది అవతార్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఈ సినిమాలో సాయితేజ్ కూడా నటించాడనే సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, జులై 28వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.