అమాయకుల రక్తంతో తడిసిన పునాదులతో జగన్ సామ్రాజ్యం ఏర్పడింది: జవహర్
- టీడీపీ పునాదుల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న జవహర్
- సాక్షి టీవీ, సాక్షి పేపర్ కు భారతి యజమాని కాదా? అని ప్రశ్న
- పత్రికా స్వేచ్ఛను కూడా జగన్ హరించారని విమర్శ
అమ్మఒడిని ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే ఇస్తే... రెండో బిడ్డ పరిస్థితి ఏమిటని అడిగారు. సంక్షేమాన్ని పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీని విమర్శించడాన్ని జగన్ మానుకోవాలని చెప్పారు. పత్రికా స్వేచ్ఛను కూడా జగన్ హరించారని... జగన్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదని విమర్శించారు.