ఉమ్మడి పౌర స్మృతిని ముందుగా హిందువులకు వర్తింపజేయాలంటున్న డీఎంకే
- అన్ని కులాలను దేవాలయాల్లోకి అనుమతించాలని డిమాండ్
- యూసీసీ అవసరం లేదంటున్న తమిళనాడు అధికార పక్షం
- ప్రజల దృష్టిని మళ్లించేందుకే యూసీసీ ప్రస్తావన తెచ్చారని కాంగ్రెస్ ఆరోపణ
మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ విషయంలో మోదీ, బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. దేశంలో ప్రధాన సమస్యలైన పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి ముందుగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘మణిపూర్ సమస్యపై ఆయన ఎప్పుడూ మాట్లాడరు. ఆ రాష్ట్రమంతా మండుతోంది. ఈ సమస్యలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు’ అని విమర్శించారు.