రెండు దశాబ్దాల పోరాటానికి ప్రతిఫలం.. న్యూయార్క్ స్కూళ్లకు దీపావళి సెలవు
- వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి దీపావళి సెలవు
- దీపావళి సెలవు కోసం రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న అసెంబ్లీ సభ్యురాలు జెనిఫెర్
- గవర్నర్ సంతకం చేయడమే ఆలస్యం
స్కూళ్లకు దీపావళి సెలవు ప్రకటించినా అది ఈ ఏడాది మాత్రం అందుబాటులో ఉండదు. 2023-24 స్కూల్ కేలండర్ ఇప్పటికే రూపొందడంతో వచ్చే ఏడాది నుంచి పిల్లలకు దీపావళి సెలవు అందుబాటులోకి వస్తుంది. గవర్నర్ కేథీ హోచల్ ఈ బిల్లుపై సంతకం చేసిన అనంతరం దీపావళి సెలవు అధికారికం అవుతుంది.