త్వరలో డబుల్ ఇంజిన్ సర్కార్ మాయం: మమతా బెనర్జీ
- బీజేపీ దేశాన్ని అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శ
- తాము బీజేపీ వ్యతిరేక మహా కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
- ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపణ
కాషాయ శిబిరం ఆదేశానుసారం రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను బీఎస్‌ఎఫ్ భయపెడుతోందని మమత ఆరోపించారు. వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించాలని పోలీసు అధికారులను మమత కోరారు.
పంచాయతీ ఎన్నికలకు ముందు, కొంతమంది BSF అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఓటర్లను బెదిరించి, ఓటు వేయవద్దని బలవంతం చేస్తున్నారని తనకు సమాచారం అందిందని చెప్పారు. వారి వ్యూహాలకు భయపడవద్దని, ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేయమని తాను ప్రజలను కోరుతున్నానని అన్నారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, ఇందులో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదన్నారు.