గర్భిణీ తల్లిని తుపాకీతో కాల్చి చంపిన రెండేళ్ల బాలుడు!!
- అమెరికాలోని ఒహియోలో విషాద సంఘటన
- ఆడుకుంటూ వెళ్లి ఇంట్లోని తుపాకీ తీసి, వెనుక నుండి తల్లిని కాల్చిన చిన్నారి
- ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపు కన్నుమూత
కిందపడిపోయిన లారా... తన భర్తతో పాటు ఎమర్జెన్సీ విభాగానికి ఫోన్ చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండేళ్ల బాబు నుండి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కడుపులో బిడ్డ సహా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేపట్టారు.