Jyothi: నిర్మాత కేపీ చౌదరి ఫోన్ కాల్స్ పై స్పందించిన నటి జ్యోతి

Actress Jyothi reacts on KP Chowdary issue
షార్ట్స్‌లో చూడండి
డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి పోలీస్ కస్టడీలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడైనట్టు తెలిసింది. ముఖ్యంగా, పలువురు టాలీవుడ్ భామలతో కేపీ చౌదరి వందల కొద్దీ ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. 

కాగా, ఈ వ్యవహారంలో తన పేరు కూడా తెరపైకి రావడం పట్ల నటి జ్యోతి స్పందించింది. తమ మధ్య రిలేషన్ కేవలం క్షేమ సమాచారాలు కనుక్కోవడం వరకే పరిమితం అని స్పష్టం చేసింది. 

కుమారుడితో కలిసి కేపీ చౌదరి తమ ఇంటికి వచ్చేవాడని, వాళ్లతో పాటు వారి కుక్కపిల్ల హస్కీని కూడా తీసుకువచ్చేవారని జ్యోతి వివరించింది. తమ మధ్య అంతకుమించి ఎలాంటి సంభాషణ ఉండేది కాదని, డ్రగ్స్ గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదని పేర్కొంది. ఈ వ్యవహారంలో తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని జ్యోతి స్పష్టం చేసింది.
Go Back to Shorts
Jyothi
Actress
KP Chowdary
Phone Calls
Drugs Case
Tollywood

More Telugu News