బాలికపై పూర్ణానందస్వామి లైంగిక వేధింపులు వాస్తవమే.. రిమాండ్ రిపోర్టులో పోలీసులు
- మరో బాలికపైనా పూర్ణానంద అత్యాచారం
- గర్భం దాల్చడంతో ఇంటికి తీసుకెళ్లిన బంధువులు
- ఈ నెల 20న స్థానికంగా విచారణ చేపట్టిన పోలీసులు
గర్భం దాల్చిన మరో బాలిక
ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాధిత బాలికను పూర్ణానందస్వామి అర్ధరాత్రి వేళ నిద్రలేపి తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవారు. మరో బాలికతోనూ ఆయన ఇలాగే ప్రవర్తించడంతో ఆమె గర్భం దాల్చింది. విషయం తెలిసిన బంధువులు బాలికను ఆశ్రమం నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే, ఈ విషయం వెలుగులోకి రాలేదు. స్వామి అత్యాచారాలు భరించలేని బాలిక ఆశ్రమం నుంచి తప్పించుకోవడంతో ఆయన లీలలు ఇప్పుడు బయటకొచ్చాయి. ఇద్దరు బాలికలపై పూర్ణానందస్వామి అత్యాచారానికి పాల్పడినట్టు ప్రాథమికంగా ఆధారాలు లభించినట్టు డీఎస్పీ వివేకానంద తన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.