నడుస్తున్న బైక్ పై జంట రొమాన్స్.. భారీ జరిమానా
- హెల్మెట్లు లేకుండా ప్రమాదకర విన్యాసం
- వెనుక కారులో వస్తున్న వ్యక్తి ఫోన్ లో చిత్రీకరణ
- దీనిపై రూ.21,000 జరిమానా విధించిన పోలీసులు
ఓ యువకుడు బైక్ నడుపుతుండగా, అతడ్ని కౌగిలించుకుని ఓ యువతి ముందు భాగంలో కూర్చుంది. దీంతో నిదానంగా వెళుతున్నారా? అంటే అదీ లేదు. వేగంగా దూసుకుపోతున్నారు. పైగా ఇద్దరికీ హెల్మెట్లు లేవు. వీరి వ్యవహారాన్ని కారులో వెళుతున్న ఓ వ్యక్తి షూట్ చేశారు. జాతీయ రహదారి9పై ఇందిరాపురం పరిధిలో ఇది జరిగింది. దీనిపై ఘజియాబాద్ పోలీసులు స్పందించారు. ‘‘ట్విట్టర్ నుంచి అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నాం. చలానా జారీ చేశాం’’ అని ప్రకటించారు. వాహన దారుడికి రూ.21,000 చలానా విధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని పోలీసులు షేర్ చేశారు.