బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న షారుఖ్ కూతురు.. కోట్ల విలువైన భూమి కొనుగోలు

Shahrukh daughter Suhana purchased costly land
  • అలీబాగ్ లో రూ. 12.91 కోట్లతో భూమి కొనుగోలు చేసిన సుహానా
  • ఇదే ప్రాంతంలో షారుఖ్ కు విలాసవంతమైన బంగ్లా
  •  'ది ఆర్చీస్' సినిమాతో తెరంగేట్రం చేస్తున్న సుహానా
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ సుహానాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెకు చెందిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ఆమెకు చెందిన మరో వార్త వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అలీబాగ్ లో అత్యంత ఖరీదైన వ్యవసాయ భూమిని ఆమె కొనుగోలు చేశారు. 

MoneyControl.com కథనం ప్రకారం ఆమె రూ. 12.91 కోట్లతో 1.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది జూన్ 1న ఈ భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. అలీబాగ్ లో షారుఖ్ కు అత్యంత విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. 20 వేల చదరపు మీటర్లలో ఈ బంగ్లా ఉంది. ఇదే ప్రాంతంలో దీపికా పదుకుణే, రణవీర్ సింగ్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వంటి సెలబ్రిటీలకు కూడా ప్రాపర్టీలు ఉన్నాయి. 

మరోవైపు త్వరలోనే సుహానా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. జోయా అఖ్తర్ చిత్రం 'ది ఆర్చీస్' ద్వారా ఆమె తెరంగేట్రం చేస్తోంది. ఇదే సినిమా ద్వారా శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా సినీ రంగ ప్రవేశం చేయబోతోంది.
Advertisement
Suhana Khan
Bollywood
Land
Shahrukh Khan

More Telugu News