బయో ఇథనాల్ ప్లాంట్లకు శంకుస్థాపన చేసిన జగన్
- నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్లు
- వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
- ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురుచూస్తున్నామన్న కాకాణి
శంకుస్థాపన అనంతరం కాకాణి గోవర్ధన్ మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చొరవతో పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగామని అన్నారు. ప్లాంట్లకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం ఇచ్చామని చెప్పారు. ఈ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.