త్వరలో ఇండియాలోకి టెస్లా కంపెనీ ఎంట్రీ
- ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఎలాన్ మస్క్ ప్రకటన
- మస్క్ తో భేటీ అద్భుతంగా సాగిందంటూ మోదీ ట్వీట్
- మరోసారి కలుసుకోవడం గర్వకారణమంటూ మస్క్ రీట్వీట్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో భేటీ అద్భుతంగా జరిగిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎనర్జీ రంగం నుంచి ఆధ్యాత్మికం దాకా ఎన్నో విషయాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయని మోదీ వివరించారు. ట్విట్టర్ యజమాని కూడా అయిన ఎలాన్ మస్క్ భారత ప్రధాని మోదీ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. మిమ్మల్ని మరోమారు కలుసుకోవడం నాకు గర్వకారణమని పేర్కొన్నాడు.